నాకే ఇలా జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితేంటి?: కోడెల

  • ఇన్ మెట్లలో రిగ్గింగ్ సమాచారం తెలిసి అక్కడికి వెళ్లాను
  • పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే నాపై దాడి చేశారు
  • వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తారని ముందే ఊహించా
ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడెల స్పందిస్తూ, ఇన్ మెట్ల పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ కు పాల్పడుతున్నారన్న విషయం తెలిసి పరిశీలించేందుకు అక్కడికి వెళ్లానని అన్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే తనపై దాడి చేశారని, దీంతో, పోలింగ్ అధికారులు తలుపులు వేస్తే వాటినీ పగులగొట్టారని ఆరోపించారు. వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తారని ముందే ఊహించామని, ఈ విధంగా దాడులు చేయడం, ఇన్నేళ్లలో మొదటిసారిగా చూస్తున్నానని అన్నారు. ‘నాకే ఇలా జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితేంటి?’ అని ప్రశ్నించారు.  
Go Back to Shorts
Guntur District
Sattenapalli
Telugudesam
kodela
YSRCP

More Telugu News